మళ్లీ తండ్రి అయిన అల్లు అర్జున్…
అల్లు వారింట మరో చిన్న పాపయి అడుగిడింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు సోమవారం సాయంత్రం మరో బిడ్డ పుట్టింది. దీంతో అల్లు ఫ్యామిలీలో ఆనందానికి కొదవలేదు. బన్నీ భార్య స్నేహారెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని బన్నీ తన వ్యక్తిగత ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశాడు.
బన్నీ దంపతులకు తొలి సంతానంగా అబ్బాయి అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో తనకు ఎంతో ఆనందంగా ఉందని, తాను అదృష్టవంతుడినని బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నాడు. తమను అభినందించినవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.