సూర్య హైట్‌పై యాంకర్ల చెత్త కామెంట్స్‌

గ్యాంగ్ సినిమా సక్సెస్‌ తో ఆనందంగా ఉన్న సూర్యపై ఓ తమిళ మ్యూజిక్‌ ఛానల్‌ యాంకర్‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకోసం రెడీ అవుతున్న సూర్య తరువాత కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

అయితే సూర్య సినిమాలో అమితాబ్‌ నటించటంపై మాట్లాడిన యాంకర్‌, సూర్య హైట్‌ గురించి కామెంట్‌ చేశారు. సింగం సినిమాలో తన కన్నా ఎత్తున్న అనుష్కనే తల పైకెత్తి చూసిన సూర్య, అమితాబ్‌తో నటిస్తే స్టూల్‌వేసుకోవాల్సి ఉంటుందేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. గ్యాంగ్ సినిమాలోనూ సూర్య హైట్‌కు సంబంధించిన ప్రస్తావన ఉంది. జాబ్ ఇంటర్య్యూలో విలన్‌ సూర్య హైట్ గురించి కామెంట్‌ చేస్తాడు. అయితే సినిమా క్లైమాక్స్‌లో విలన్‌ తో ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు.. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది ముఖ్యమని సమాధానమిస్తాడు.

సూర్యపై టీవీ యాంకర్లు చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ వర్గాలు తీవ్రంగా స్పందింస్తున్నారు. హీరో విశాల్‌. ‘ఇది హాస్యమా..?? కానే కాదు. నవ్వించటం కోసం ఎంత అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశాడు. సూర్య అభిమానులు యాంకర్లు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *