కాశ్మీర్ పై సుప్రీంకోర్టు తీర్పు

ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో వున్న ఆంక్షల్ని సడలించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కానీ ప్రభుత్వ యంత్రాంగం విధించిన ఆంక్షల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం దీనిపై వాదనలను స్వీకరించింది. ఈ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. రోజురోజుకీ అక్కడ పరిస్థితులు మెరుగవుతున్నాయని. ప్రశాంత వాతావరణానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, అక్కడ మానవ హక్కుల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని. ప్రజలకు విద్య, వైద్యం లాంటి కనీస వసతులను అందుబాటులో ఉంచారని, క్రమంగా ఆంక్షలు సడలించే యోచనలో ప్రభుత్వం ఉందని అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్‌ను తెలిపారు. దీనితో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి ప్రభుత్వం కొంత సహేతుకమైన సమయం ఇవ్వాల్సిన అవసరముందని, పరిస్థితుల్లో మార్పురాకపోతే అప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *