సుడిగాలి సుధీర్ కి ఓ మధుర జ్ఞాపకం

ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’తో సుడిగాలి సుధీర్ సినిమా హీరోగా  చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన ‘రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమా అతిత్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుడిగాలి సుధీర్. తన జీవితంలో తనకు మెగాస్టార్ చిరంజీవితో ఓ మధుర జ్ఞాపకం ఉందని చెబుతూ దానిని గుర్తు చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. తాను కొత్తగా ఇల్లు కొనుక్కొని గృహప్రవేశానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో తనవెంట తన తమ్ముడు కూడా ఉన్నాడని సుధీర్ తెలిపారు. చిరంజీవి గారు అంత పెద్ద స్టార్ అయినప్పటికీ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారని సుధీర్ చెప్పుకొచ్చారు. తమకు ట్రేలో పాలు తెప్పిస్తే తాగడానికి కొంత మొహమాట పడ్డానని.. కానీ ఆయనే స్వయంగా పాలు కలిపి ఇవ్వటంతో జన్మ ధన్యమైపోయిందని సుధీర్ చెప్పాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి గారు కొత్తబట్టలు గిఫ్ట్ తెప్పించి ఇచ్చారని తెలిపాడు చిన్నప్పటినుంచి అభిమానించే హీరో చిరంజీవి ఇలా.. తాను  తనను అంతటి ప్రేమతో చూడడంతో కన్నీళ్లు ఆగలేదని సుధీర్ అన్నాడు. చిరంజీవి గారి ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఆయన చూపించిన ఆప్యాయత గురించి అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెబుతూ గట్టిగా ఏడ్చేశానని సుధీర్ పేర్కొన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *