చిరంజీవి ‘సై రా’: అమితాబ్‌తో పాటు అదిరిపోయే స్టార్స్, టెక్నీషియన్స్!

చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా మెగాస్టార్ పుట్టిరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సై రా నరసింహా రెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ చిత్ర సీమలో బాహుబలిని మించిన సినిమా లేదు. అయితే ‘బాహుబలి’ని మించేలా ‘సై రా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కబోతోంది. ఊహకు కూడా అందని భారీ తారాగణంతో ఈ సినిమా రాబోతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తొలిసారిగా తెలుగు సినిమాలో నటించబోతున్నారు. ఈయనతో పాటు పలువురు స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

నరసింహారెడ్డిగా చిరంజీవి ‘సై రా నరసింహారెడ్డి’ టైటిల్ రోల్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. పాత్రకు తగిన విధంగా మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే లుక్ లో కనిపించబోతున్నారు. 62 ఏళ్ల వయసులో చిరంజీవి యుద్ధ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలతో కూడిన సినిమా ఎంచుకోవడం విశేషం.

షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబ్ షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు అనేది త్వరలో ప్రకటించనున్నారు

డేరింగ్ స్టార్ జగపతి బాబు డేరింగ్ స్టార్ జగపతి బాబు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ పాత్ర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర తెలిపింది.

కిచ్చా సుదీప్ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయబోతున్నారు. బాహుబలి సినిమాలోనూ కిచ్చా సుదీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సుదీప్ ద్వారా కన్నడ మార్కెట్ వశం చేసుకోవచ్చే ఉద్దేశ్యం కనిపిస్తోంది.

క్వీన్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ నయనతార క్వీన్ ఆఫ్ ఆఫ్ సౌతిండియా సిల్వర్ స్క్రీన్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈవిడ నటించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ద్వారా తమిళ మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించవచ్చని దర్శక నిర్మాతల ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఏఆర్ రెహమాన్ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇండియాలో నెం.1 గా పేరొందిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు.

రవి వర్మన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫగా రవి వర్మన్ పని చేస్తున్నారు. ఈ గతంలో పలు భారీ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు.

రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవన్ పని చేస్తున్నారు. గతంలో రాజీవన్ పలు అద్భుతమైన సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు.

పరుచూరి బ్రదర్స్ సై రా నరసింహారెడ్డి చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచయితలు. ఈ సినిమా స్క్రిప్టును డెవలప్ చేసింది ఈ ఇద్దరే.

ప్రొడ్యూసర్ ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి కెరీర్లోనే ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్. ఆయన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *