సైరా నరసింహరెడ్డి ట్రైలర్-2…చిరు వార్ లుక్స్ వావ్…

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహరెడ్డి. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌లకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచేస్తూ మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఈ ట్రైలర్‌ అభిమానుల్లో అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. యాక్షన్‌ సీన్స్‌లో చిరు లుక్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి.

ఈ ట్రైలర్‌లో చిరుతో పాటు సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు పాత్రలను కూడా ప్రధానం చూపించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా లేడీ సూపర్‌ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *