సైరా నరసింహారెడ్డి డిజిటల్, శాటిలైట్ రైట్స్…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త రికార్డ్‌ లు సృష్టిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సైరా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌కు సంబంధించిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సైరా డిజిటల్‌ హక్కులు 40 కోట్లకుపైగా ధర పలికినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల శాటిలైట్‌ హక్కులు అన్ని కలిపి 70 కోట్లకు పైగా పలికాయట. అంటే కేవలం డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల ద్వారా సైరా 100 కోట్లకు పైగా బిజినెస్‌ చేసింది. ఇక థియెట్రికల్‌ బిజినెస్‌ కూడా భారీ స్థాయిలో జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం అన్న టాక్‌ వినిపిస్తోంది.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రక చిత్రాన్ని మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్  కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, తమన్నా, రవి కిషన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *