‘టక్ జగదీష్’ ప్రారంభమైంది
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో కొత్త చిత్రం ‘టక్ జగదీష్’ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ‘నిన్నుకోరి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న చిత్రమిది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టగా.. నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.