తమన్నాకు కేవలం మూడు గంటలకు ఎంత అడుగుతోందో తెలుసా..?

మిల్కీ బ్యూటీ తమన్నాకు సినిమా అవకాశాలు తగ్గాయి గానీ, క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ వైట్ అండ్ వైట్ భామకు తెలుగు, తమిళ యూత్ లో పడిచచ్చిపోయే అభిమానులున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రం బాగా తెలిసిన బిజినెస్ ఉమన్ తమన్నా, ఆ సూత్రాన్ని అక్షరాలా అమలు చేస్తోంది. గ్లామర్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకుంటోంది. భారీగా వసూలు చేస్తూ, క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది.

గ్లామర్ పరంగానే కాక, డ్యాన్స్ పరంగా ఇప్పుడున్న హీరోయిన్స్ లో తమన్నాకు దగ్గరగా వచ్చేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఏ స్టెప్పైనా హీరోలతో సమానంగా చేసే ఈ అమ్మడు, స్టేజ్ పై డ్యాన్స్ వేసిందంటే, ఇక చెప్పనే అక్కర్లేదు. లైవ్ లో చూసినోళ్లు ఊగిపోవాల్సిందే. అందుకే ఒక రాత్రికి, అందునా కేవలం మూడు గంటలకు అక్షరాలా కోటి 20 లక్షలు ఛార్జ్ చేస్తోంది. ఇంత భారీగానా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే, ఆమె రావాలి గానీ ఇంకా ఎక్కువే ఇస్తామంటున్నారు ఇచ్చేవాళ్లు. వాళ్లు అంత ఇస్తుంటే, నాకేంటి ఇబ్బంది అంటూ ఆ క్యాష్ తీసుకుని, చక్కగా డ్యాన్స్ చేసేసి వస్తోంది తమ్మూ. సినిమాకు 50 లక్షలకు అటు ఇటుగా తీసుకునే తమన్నా, కేవలం రెండు మూడు గంటల డ్యాన్సులకు ఇంత డిమాండ్ చేయడం చూసి, మిగిలిన హీరోయిన్స్ కూడా చక్కగా డ్యాన్సులు చేసుకుని బ్రతికేస్తే పోలా అనుకుంటున్నారట. త్వరలో వస్తున్న న్యూ ఇయర్ వేడుక కోసం, ఇప్పటికే తమన్నా డైరీ నిండిపోయిందట. మొత్తమ్మీద మిల్కీ అటు సినిమాలు, ఇటు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తో రెండు చేతులా సంపాదించేస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *