400 మందికి బంగారపు ఉంగరాళ్ళు ఇచ్చిన హీరో

తమిళ హీరో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం బిగిల్. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నా విజయ్ ఆ సందర్భంగా ఆ సినిమాకు పనిచేసిన 400 మండి నటులు, టెక్నీషియన్లకు బంగారపు ఉంగరాలను బహుకరించారు. బిగిల్‌ నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా కలపతి సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. దీనితో ఇది వైరల్ గా మారింది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్‌ తండ్రి, కుమారుడి పాత్రల్లో కనిపించనున్నారు. ఒక గ్యాంగ్‌స్టార్‌, మహిళ ఫుట్‌బాల్‌ కోచ్‌గా విజయ్‌ కనిపించనున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత సమకూర్చుతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా దీపావళికి విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *