శాత‌క‌ర్ణిపై రేవంత్‌రెడ్డి రివ్యూ..సూపర్ అంటున్నరేవంత్

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 12న రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రివ్యూ షో కోసం హీరో బాల‌య్య ప‌లువురు సెల‌బ్రిటీల‌ను ఆహ్వానించే ప‌నిలో బిజీబిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే బాల‌య్య ఈ రోజు శాత‌క‌ర్ణి ప్రీమియ‌ర్ షోకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు తెలంగాణ స‌చివాల‌యానికి వెళ్లారు.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య టీటీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి ప‌సుపు ప‌చ్చ పూల‌బొకేతో స్వాగ‌తం ప‌లికారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య తెలంగాణ టీటీడీఎల్పీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్క‌డ బాలయ్య, రేవంత్ పక్కపక్కనే కూర్చున్నారు. ఆ సమయంలో బాలయ్య తన మొబైల్ తీసి రేవంత్‌కు కొన్ని వీడియోలు చూపించారు. ఆ వీడియోలు శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన‌వి అయ్యి ఉంటాయ‌ని..సినిమాలో కీల‌క‌మైన కొన్ని సీన్ల‌ను బాల‌య్య రేవంత్‌కు చూపించార‌ని ప‌క్క‌నే ఉన్న టీడీపీ వ‌ర్గాల ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది.

ఈ సీన్లు చూసిన రేవంత్ బాల‌య్య న‌ట విశ్వ‌రూపంతో పాటు వార్ విజువ‌ల్స్‌ను ప్ర‌శంసించిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ సీన్లు చూడ‌డానికి రేవంత్ క‌ళ్లు కాస్త ఇబ్బంది ప‌డుతుంటే బాల‌య్య తన కళ్లజోడు తీసి రేవంత్‌కు పెట్టే ప్రయత్నం చేశారు. ‘‘సైట్ అంటున్నావు కదా ఈ కళ్లజోడు పెట్టుకో’’ అంటూ బాలయ్య చిరునవ్వులు చిందించారు. ఆ తర్వాత కూడా ఆ వీడియోను చూపిస్తూ బాలయ్య రేవంత్‌తో చెవిలో ఈ సీన్ల‌పై గుస‌గుస‌లాడారు. ఓవ‌రాల్‌గా అయితే రేవంత్‌కు శాత‌క‌ర్ణి సీన్లు సూప‌ర్బ్‌గా న‌చ్చేశాయ‌ని తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *