పూరీ ఒడ్డున కేసీఆర్ సైకత శిల్పం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కార్యాలయాల్లో నేతలు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కొందరు అభిమానులు కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

పూరీ సాగర తీరంలో తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ సైకత శిల్పం వెలిసింది. పూరీ బీచ్‌లో ప్రముఖ సైకత శిల్పకారుడు, ప్రైడ్ ఆఫ్ ఒడిశా అవార్డు గ్రహీత మనస్‌కుమార్ ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు. ‘బంగారు తెలంగాణ కార్యసాధకుడు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ సందేశం రాసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

దక్షిణాది రాష్ర్టాల్లో ఇప్పటివరకు ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి ఇలాంటి గౌరవం దక్కలేదు. పూరీ బీచ్‌లో ప్రముఖ సైకత శిల్పకారుడు, ప్రైడ్ ఆఫ్ ఒడిశా అవార్డు గ్రహీత మనస్‌కుమార్ ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు.   కేటీఆర్ సాధించిన విజయాలకు గుర్తుగా యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, టీ హబ్ లోగోలు, కేటీఆర్ సొంతం చేసుకొన్న స్కాచ్ చాలెంజర్ అవార్డును ఈ సైకత శిల్పంలో పేర్కొనడం గమనార్హం.గతంలో పూరీ బీచ్‌లో సైకత శిల్పం ఏర్పాటు చేసిన తొలి దక్షిణాది నేత కేటీఆర్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తర్వాత ఈ గౌరవాన్ని మంత్రి కేటీఆర్ దక్కించుకున్నారు.  తాజాగా సీఎం కేసీఆర్ సైకత శిల్పం పూరి ఒడ్డున వెలిసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *