తెలంగాణలో మరో రెండువేల కొలువులు

తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగులకు మరో శుభవార్త వినిపించేందుకు  సిద్ధమయింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలకు మేరకు  కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.  దాదాపు రెండువేల ఉద్యోగాల భర్తీకి వచ్చేవారం ప్రకటనలు విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఈ మేరకు తెలంగాణ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీఎస్‌పీఎస్సీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది. త్వరలో విడుదలచేసే ప్రకటనల గురించి కమిషన్ వర్గాల నుంచి సీఎస్ ఎస్పీ సింగ్ వివరాలు సేకరించారు.  నాలుగు రకాల ఉద్యోగాల భర్తీకి వచ్చేవారం ప్రకటనలు విడుదల అవుతాయని టీఎస్‌పీఎస్సీ వర్గాలు సీఎస్‌కు వెల్లడించినట్టు సమాచారం. 1800 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 67 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, పదుల సంఖ్యలో రేడియాలజిస్టులు, రేడియాలజీ విభాగం లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేస్తామని, దీనికి సంబంధించిన తుది ప్రక్రియ పూర్తిచేశామని టీఎస్‌పీఎస్సీ వివరించినట్టు తెలుస్తున్నది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *