కరోనా వైరస్ కు మందు దొరికిందంటున్నారు

కరోనా వైరస్.. ఈ పేరు వినగానే ప్రపంచం వణికిపోతోంది. చైనా నుంచి మెల్లమెల్లగా ప్రపంచదేశాలకు విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి.. విస్తృతంగా దీనిపై ప్రచారం చేస్తోంది. దీని బారిన పడ్డవాళ్లలో ఇప్పటి వరకు 259 మంది చనిపోయారు. కరోనాకు విరుగుడు ఏంటా అని ప్రపంచమంతా ఆలోచిస్తుంటే.. చైనా ఓ సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నారని.. 243 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశామని చైనా అధికారులు తెలిపారు. వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు. చైనా తాజా ప్రకటనతో ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో 11వేలకు మందికి పైగా కరోనా వైరస్ బాధితులను గుర్తించారు. నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలో సత్వర నివారణ చర్యలు చేపట్టడంతో.. బాధితులకు వైద్య సాయం పెద్ద ఎత్తున అందుతోంది.

బ్రిటన్‌కు చెందిన కానర్‌ రీడ్‌ అనే వ్యక్తి చైనాలోని వుహాన్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ గురించి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నేను తీవ్రమైన దగ్గు, జలుబుతో కూడిన ఫ్లూ, న్యుమోనియాతో బాధపడ్డాను.   డాక్టర్లు సూచించిన ఆంటీ బయాటిక్‌ మందులను సున్నితంగా తిరస్కరించానని.. ప్రాణాంతక మహామ్మారిని తేనె, మద్యంతో అరికట్టవచ్చని ఓ బ్రిటీష్‌ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు.

థాయ్‌ల్యాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్‌ను మట్టుబెట్టా  మంటూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా వైరస్ బారిన పడ్డ ఓ వృద్ధురాలని కేవలం 48 గంటల్లో ఆరోగ్య వంతురాలిని చేశామని చెప్పింది. ఫ్లూ, హెచ్‌ఐవీ చికిత్సల్లో ఉపయోగించే యాంటి వైరల్ మందులను వివిధ మోతాదుల్లో కలగలిపి ఇవ్వడం ద్వారా ఇది సాధించామని తెలిపింది. ఈ చికిత్స తరువాత బాధితురాలి శరీరంలో కరోనా వైరస్ ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయని తెలిపింది. కాగా.. తాజా లెక్కల ప్రకారం థాయ్‌ల్యాండ్‌లో మొత్తం 19 మంది కరోనా బారిన పడ్డారు. చైనా తరువాత అత్యధిక సంఖ్యలో ‘కరోనా’ బాధితులున్న దేశం థాయ్‌ల్యాండ్ కావడం గమనార్హం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *