ఇరాన్‌పై యుద్ధానికి ముగింపు పలకాలని

అమెరికా భద్రతా బలగాలు బాగ్దాద్ విమానాశ్రయంపై దాడి చేసి ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని హతమార్చాయి. సులేమానీని హత్య చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా భద్రతా బలగాలు బాగ్దాద్ విమానాశ్రయంపై దాడి చేసి ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని హతమార్చాయి. సులేమానీని హత్య చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక ఇరాన్ చరిత్రలో తొలిసారిగా జంకారా మసీద్ గుమ్మటంపై ఎర్ర జెండాను ఎగరేశారు. మసీదు పైభాగంలో ఎర్ర జెండా ఎగరేయడం యుద్ధం రాబోతున్నది అనడానికి సంకేతంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం 2015 నుంచి అగ్రరాజ్యం ఇప్పటికే వైదొలగింది. ఈ ఒప్పందంలో కీలక నిబంధన నుంచి సైతం తాము వైదొలగుతున్నట్టు ఇరాన్ ప్రకటించింది.పైగా అగ్రరాజ్యం అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పైగా  బాగ్దాద్‌లోని బలాడ్‌ అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్  రాకెట్‌ దాడి చేసింది. అంతే కాకుండా అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.   ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్;అమెరికా ఆస్తులపై దాడులు జరుగుతున్న సమయంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దేశ పౌరులపై గానీ .. అమెరికా ఆస్తులపై గానీ దాడులకు దిగితే అగ్రరాజ్యం ఊరుకోబోదని హెచ్చరించారు. దాడులు జరిగిన మరు క్షణమే తీవ్రంగా రియాక్షన్ వస్తుందంటూ హెచ్చరించారు. అమెరికా టార్గెట్ లో ఇరాన్ లోని 52 ప్రాంతాలు ఉన్నాయని స్పష్టం చేశారు.అమెరికా రక్షణ వ్యవస్థ..ప్రపంచంలో అన్ని దేశాల కంటే బెస్ట్ గా ఉందంటూ ట్వీట్ చేశారు.ట్రంప్‌ సర్కారు ఇరాన్‌, ఇరాక్‌లో దాడులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి! ట్రంప్‌ ప్రభుత్వ చర్యలను ఆందోళనకారులు ఖండించారు. అమెరికాకు చెందిన వివిధ సంస్థలు కలిసి శనివారం 70కి పైగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాయి. ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ సులేమానీని హతమార్చడంతో పాటు పశ్చిమాసియాకు అదనంగా మూడు వేల మంది సైనికులను పంపాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. ‘‘పశ్చిమాసియా నుంచి అమెరికా బయటికి వస్తే తప్ప న్యాయం జరగదు, శాంతి నెలకొనదు’’ అంటూ నినదించారు. ‘ఇరాక్‌లో బాంబు దాడులు ఆపండి’, ‘అమెరికా దళాలు ఇరాక్‌ను వీడాలి’ అంటూ షికాగోలోని ట్రంప్‌ స్క్వేర్‌ వద్ద 500 మందికిపైగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాన్‌పై యుద్ధానికి ముగింపు పలకాలని, ఇరాక్‌లోని బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని డిమాండ్‌ చేశారు. శ్వేతసౌధం ఎదుట, న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా వ్యవహరించవద్దంటూ నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీ్‌ఫతో ఫోన్‌లో మాట్లాడారు. రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *