అత్యంత పొడవైన గొబ్బెమ్మను తయారు చేశారు

ఆలమూరు: సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసులు, డూ డూ బసవన్నల కోలాహలంతోపాటు గొబ్బెమ్మలు కూడా దర్శనమిస్తాయి. ఈ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరానికీ పరిచయం చేయాలనే సంకల్పంతో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన మహిళలు అత్యంత పొడవైన గొబ్బెమ్మను తయారు చేశారు. శ్రీ ఉరదాలమ్మ, దండుగంగమ్మ ఆలయం ఆవరణలో 10.10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో గొబ్బెమ్మను తీర్చిదిద్దారు.గుమ్మిలేరుకు చెందిన హరే శ్రీనివాస భక్త భజన బృందం, గ్రామ మహిళా సమాఖ్యకు చెందిన 20 మంది మహిళలు ఐదు టన్నుల ఆవుపేడను సేకరించి.. దాదాపు వారం పాటు శ్రమించి ఈ గొబ్బెమ్మను తయారుచేశారు. దీనిని పూలు, రంగులతో శోభాయమానంగా అలంకరించారు. భారత్‌ టాలెంట్స్‌ ఆఫ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చీఫ్‌ ఎడిటర్‌ మోహిత్‌కృష్ణ ఇది అత్యంత పొడవైన గొబ్బెమ్మగా ధ్రువీకరణ పత్రం అందజేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *