సాఫ్ట్ వేర్ సుధీర్

జబర్దస్త్ వంటి ప్రముఖ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్ కథ: చందు (సుడిగాలి సుధీర్) అమాయకుడైన మంచి లక్షణాలు కలిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తన ఆఫీస్ లో పనిచేసే స్వాతి (ధాన్యా బాలకృష్ణ) ప్రేమలో పడిన చందు ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. ఒకరినొకరు ఇష్టపడిన చందు స్వాతి ఎంగేజ్మెంట్ జరిగిన అనంతరం వారి కుటుంబాలలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సెంటిమెంట్స్ ని ఎక్కువగా ఫాలో అయ్యే స్వాతి సలహా మేరకు ఓ స్వామిజీని వీరు కలవడం జరుగుతుంది. ఐతే ఆ స్వామిజీ చందుని పావుగా వాడుకొని సుధీర్ తండ్రి (సాయాజీ షిండే) పనిచేసే మంత్రి (శివ ప్రసాద్) దగ్గర నుండి వెయ్యి కోట్లు కొట్టివేస్తారు.దీంతో మంత్రి నా డబ్బులు నాకు తిరిగి అప్పగించకపోతే చందుని చంపేస్తాను అని బెదిరిస్తాడు. మరి చందు ఆ వెయ్యి కోట్లు తిరిగి సంపాదించాడా? ఆ స్వామీజీని కనిపెట్టడా? అసలు స్వామిజీ గా నటించిన వారు ఎవరు? వాళ్ళు మంత్రి దగ్గర ఎందుకు డబ్బులు కొట్టివేశారు? అనేది తెరపైన చూడాలి. జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ షోలో నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా తెరపై తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డాన్స్ లలో ఆయన మాస్ హీరో రేంజ్ లో ఇరగదీశాడు. అమాయకుడైన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా సుధీర్ నటన పాత్రకు తగ్గట్టుగా ఉంది. అక్కడక్కడా ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంది. హీరోయిన్ ధన్యా బాలకృష్ణ రెండు భిన్న షేడ్స్ కలిగిన పాత్రను చక్కగా పోషించింది. పాటలలో ఆమె గ్లామర్ యూత్ కి కిక్కెక్కించేదిలా ఉంది. అలాగే పతాక సన్నివేశాలలో కూడా ఆమె చక్కగా నటించారు. సెకండ్ హాఫ్ లో కథలో వచ్చే రెండు ట్విస్ట్స్ బాగున్నాయి. ఇక భీమ్స్ అందించిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరో తల్లి దండ్రులుగా చేసిన సాయాజీ షిండే, ఇంద్రజ తమ పరిధిలో చక్కగా నటించారు. మంత్రి పాత్రలో శివ ప్రసాద్, హీరో మావయ్యగా పోసాని నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. కాగా నేడు ఈ చిత్రం విడుదల కావడం జరిగింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *