ఈ నెల 6న మంచినీటి సరఫరాలో అంతరాయం

గ్రేటర్‌హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు ఈ నెల 6న మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్‌-3.. 2200, 1500 ఎంఎం పైపులైను భారీ లీకేజీలు ఏర్పడుతున్న నేపథ్యంలో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి, 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు సాహెబ్‌నగర్‌, ఆటోనగర్‌, వైశాలినగర్‌, మీర్‌పేట్‌, జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, శాస్ర్తీపురం, బండ్లగూడ, బుద్వేల్‌, సులేమాన్‌నగర్‌, హైదర్‌గూడ, గోల్డెన్‌హైట్స్‌, గంధంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, ఆసి్‌ఫనగర్‌, రెడ్‌హిల్స్‌, షేక్‌పేట, ప్రశాసన్‌నగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగ్‌, బోడుప్పల్‌, చెంగిచెర్ల, ఫిర్జాదిగూడ, అల్వాల్‌, సైనిక్‌పురి, లాలాపేట్‌, స్నేహపురి కాలనీ, కైలాసగిరి రిజర్వాయర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *