ఎలా బుద్ధిచెప్పాలో ఆలోచించి….నటి తాప్సి

సినీ నటి తాప్సికి ఓ ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురైందట. తాప్సికి మాత్రం పవిత్రమైన పుణ్యస్థలంలో ఆకతాయి చేష్టలు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ ‘గురునానక్ జయంతి రోజున నేను ఫ్యామిలీతో కలిసి కచ్చితంగా గురుద్వారకు గతేడాది వెళ్ళాను. అక్కడ భక్తులకు భోజనాలు వడ్డిస్తున్నామ్ . ఆ సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు . దాంతో ఒకర్నొకరు ఢీకొట్టుకుంటూ ఉంటారు. నేను ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఆకతాయి నా నడుం పట్టుకోవాలని చూశాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఎలా బుద్ధిచెప్పాలో ముందే ఆలోచించి పెట్టుకున్నాను. అతని వేలు పట్టుకుని విరిచేశాను. దాంతో వాడు విలవిలలాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. నేను కూడా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాను’ అని తెలిపారు ‘టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సి నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. దీంతో పాటు ఆమె ‘తప్పడ్’, ‘రాకెట్ రష్మి’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *