ఇది ఇండియ‌న్ టీమా? ఆర్సీబీ టీమా?

ఆస్ట్రేలియాతో జ‌రిగే వ‌న్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇండియ‌న్ టీమ్‌పై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇది ఇండియ‌న్ టీమా లేక రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమా అని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి కార‌ణం.. ఈ టీమ్‌లో న‌లుగురు ఆర్సీబీకి చెందిన‌వాళ్లే. గ‌తంలో ధోనీ కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ వాళ్లు ఎక్కువ‌గా ఉండేవాళ్లని, ఇప్పుడు కోహ్లి కెప్టెన్ కావ‌డంతో ఆర్సీబీ వంతు వ‌చ్చింద‌ని కొంద‌రు ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శించారు. ధోనీ కెప్టెన్‌గా ఉన్న‌పుడు రైనా, అశ్విన్‌, జ‌డేజాల‌తో టీమ్ సీఎస్‌కేను త‌ల‌పించేది. ఇప్పుడు కెప్టెన్ కోహ్లితోపాటు కేదార్ జాద‌వ్‌, కేఎల్ రాహుల్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌లు ఆస్ట్రేలియాతో తొలి మూడు వ‌న్డేల‌కు ఎంపిక‌య్యారు. సీనియ‌ర్లు యువ‌రాజ్‌, రైనాల‌కు మ‌రోసారి సెల‌క్ట‌ర్లు హ్యాండిచ్చారు. దీనిపైనా ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. సీనియ‌ర్లు లేకుండా ఇలా ఆర్సీబీ టీమ్‌తో ఆస్ట్రేలియాపై ఏం గెలుస్తారు అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

జట్టు వివరాలు:

కోహ్లీ(కెప్టెన్), రోహిత్‌శర్మ (వైస్ కెప్టెన్), ధవన్, రాహుల్, మనీశ్‌పాండే, జాదవ్, రహానే, ధోనీ, హార్దిక్, అక్షర్‌పటేల్, కుల్దీప్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, ఉమేశ్, షమీ.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *