ఆ రికార్డులన్ని ఫేకే – రాజమౌళి

ఈ మాట వేరే ఎవరైనా అని ఉంటె అంతగా పట్టించుకోనవసరం ఉండేది కాదు కాని ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా బాహుబలి దర్శకుడు రాజమౌళి అన్నాడు కాబట్టి సీరియస్ గా తీసుకోవాల్సిందే. బాహుబలి 2 రిలీజ్ అయ్యాక కొంత కాలం విదేశాల్లో సేద తీరి తిరిగి వచ్చిన జక్కన్న మళ్ళి మీడియా కు అందుబాటులోకి వచ్చాడు. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించి షాక్ కి గురి చేసాడు. తన సినిమాల రికార్డుల విషయంలో తానెప్పుడు నిజాయితీగా ఉండాలని కోరుకుంటాను అని చెప్పే రాజమౌళి తన గత అనుభవాలను చెప్పడం ఇప్పుడు సదరు హీరోల ఫాన్స్ కు మింగుడు పడటం లేదు.

అల్లు అరవింద్ తో తనకున్న భేధాభిప్రాయాల గురించి మొదటి సారి వివరణ ఇచ్చాడు రాజమౌళి. మా ఇద్దరికీ మంచి అండర్ స్టాండింగ్ ఉందని, మగధీర వంద రోజుల సెంటర్ల విషయంలో తాను ఉన్నది ఉన్నట్టు ప్రకటిద్దాం అని ముందుగానే చెప్పానని, కాని తీరా ఆ టైం దగ్గరపడే సరికి ఫాన్స్ అల్లరి చేస్తారు అంటూ అదనంగా లేని సెంటర్స్ ని జత చేయడంతో దానికి నిరసనగానే వంద రోజుల వేడుకకు దూరంగా ఉన్నానని స్పష్టం చేసాడు.

ఇది మొదటిసారి కాదని సింహాద్రి సిల్వర్ జుబ్లీ విషయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేసుకున్నారు. వంద రోజుల వరకు సింహాద్రి విషయంలో అన్ని నిజాలే చెప్పిన నిర్మాత సిల్వర్ జుబ్లీ 15 కేంద్రాల్లో ఆడితే షిఫ్టింగ్ కలుపుకుని మరో 15 జత చేసి మొత్తం 30 అని చెప్పి ఇండస్ట్రీ రికార్డు చూపించారని చెప్పారు. సింహాద్రి నిర్మాత విఎంసి దొరస్వామిరాజు. అంటే స్టార్ హీరోల రికార్దుల విషయంలో ఎంత మతలబు జరుగుతోందో బట్టలు ఊడదీసినట్టు స్పష్టంగా చెప్పేసాడు రాజమౌళి.

ఇప్పుడు ట్రెండ్ మారి అంత ఫస్ట్ మంత్ కలెక్షన్స్ మీద దృష్టి పెట్టి లాంగ్ వదిలేసారు కాని లేకపోతే ఫాన్స్ పిచ్చి లో ఇవి ఇంకా పీక్స్ కి తీసుకెళ్ళిపోయేవారు అనిపిస్తుంది. అంటే ఈ లెక్కన బాహుబలి ఎంత వరకు స్ట్రాంగ్ గా ఉంటె అంత వరకు ఆడించి ఆపై మొహమాటం లేకుండా తీసేస్తారు అన్నమాట. గుడ్. మంచిదే. రికార్డుల పేరుతో అవాంచనీయమైన పోటీకి అవకాశం కల్పించి ఫాన్స్ ని మనస్తాపానికి గురి చేయటం కంటే ఇలా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ పోవడం అనేది మంచి నిర్ణయమే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *