జై తెలంగాణ పోలీస్‌

ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలం మేరకు… ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి ఘటనపై విచారణ చేపడుతామని సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తెలిపారు. కాగా బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఢిల్లీ నుంచి లక్నోకు తరలించారు. మా సోదరి ఇక మాతో లేదని, ఈ ఘోరానికి కారణమైన ఐదుగురి నిందితులకు మరణ శిక్ష విధించాలన్నదే నా ఏకైక డిమాండ్… ఆమె చివరి కోరిక కూడా ఇదేనని బాధితురాలి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి హత్యకు నిరసనగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ రాష్ట్ర విధానసభ వద్ద ధర్నాకు దిగారు. హత్యకు ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో. రాష్ట్రంలో మహిళలకు కనీసభద్రతకరువైందని విమర్శించారు. ఉన్నావ్‌ బాధితురాలి హత్యకు కారణమైన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని అఖిలేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు యోగి సర్కారే ప్రథమ దోషి అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ చరిత్రలో ఈరోజు బ్లాక్‌ డే అని అఖిలేష్‌ విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై వివిధ వర్గాల చెందిన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే శిక్షించాలని మహిళలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బాధితురాలి మృతికి నిరసనగా ఢిల్లీలోనూ పలువురు ధర్నా చేపట్టారు.

అత్యాచారం కేసుల పై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.దిశపై అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసి ఉంటారని తాను భావిస్తున్నానని అన్నారు. ఈ సమయంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

దిశ నిందితులను ఎన్‌కౌంటర్ రోజే మరో మహిళ మృగాళ్ల దాడికి బలికావడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వారికి మరణ శిక్షే సరైందని ఆమె సోదరుడు అభిప్రాయపడ్డారు. దిశపై అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసి ఉంటారని తాను భావిస్తున్నానని అన్నారు. యూపీ, ఢిల్లీ పోలీసులు తెలంగాణ పోలీసుల నుంచి నేర్చుకోవాలని మాయావతి అన్నారు. తాజాగా, ఢిల్లీ, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు, జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ తదితరులు ఈ ఘటనపై సంతోషం వ్యక్తం చేశారు. నిందితులకు తగిన శిక్ష పడిందని, పోలీసులు చర్యలను సమర్ధించారు.

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాశ్‌ సత్యార్థి స్పందిస్తూ.. రాముడు, కృష్ణుణ్ని పూజించడం కాదు.. నేటి యుగంలో ఆ అవతరాలు ఎత్తాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ‘త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో దుశ్శాసనుడు మన ఆడబిడ్డలను కేవలం ఎత్తుకెళ్లారు. కానీ నేటి యుగంలోని రాక్షసులు మన సీతలను, ద్రౌపదులను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి తగలబెడుతున్నారు. అలాంటప్పుడు రాముడిలా, కృష్ణుడిలా మారకుండా ఎంతకాలమని వారిని పూజిస్తూ ఉంటాం?’ అని ట్వీట్‌ చేశారు.

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌, ఉన్నావ్‌, ఉత్తర భారత్‌లో పలు ముఖ్య నగరాల్లో సహా అనేక ప్రాంతాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో మహిళలు, ప్రజాసంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా అత్యాచార ఘటనలో నిందితులకు క్షమాభిక్ష పెట్టే సాంప్రదాయాన్ని పక్కనపెట్టాలని పలువురు కోరుతున్నారు.

మహిళల్లో భయం కాస్త తగ్గిందని అన్నారు. క్రిమినల్స్‌కు ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ పోలీసులను చూసి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నేర్చుకుంటారని నమ్ముతున్నాని ఉమా అభిప్రాయపడ్డారు.జై తెలంగాణ పోలీస్‌..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *