భార్య వేధింపులతో నటుడు విజయ్‌ ఆత్మహత్య?

 టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు విజయ్‌ సాయి ఆ‍త్మహత్యకు పాల్పడ్డాడు. యూసఫ్‌గూడలోని అతని అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని సూసైడ్‌కి పాల్పడ్డారు. గత కొంత కాలంగా ఒంటరిగా ఉంటున్న ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు, సోగ్గాడు, భగీరథ, డిస్కో తదితర చిత్రాల్లో ఆయన నటించారు. సినిమా అవకాశాల్లేకే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు కూడా కారణమని కొందరు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, విజయ్‌ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

భార్య వేధింపులే కారణమా?

కాగా,  మృతికి భార్య వనిత వేధింపులే కారణమన్న మరో కోణం వెలుగులోకి వచ్చింది. విజయ్‌ టీవీ సీరియళ్లలో నటించే వనితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు.  విజయ్‌కు వనితకు గత మూడేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.  డబ్బు కోసం వనిత విజయ్‌ ను తరచూ వేధించేదని.. మూడు రోజుల క్రితం రౌడీలతో భర్త దగ్గరికి వచ్చి బెదిరించి మరీ బలవంతంగా కారును లాక్కెళ్లింది. ఈ మేరకు విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.  అయితే ఈ  విషయంలో పూర్తి విచారణ చేపట్టాకే స్పందిస్తామని పోలీసులు చెబుతున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *