అక్కినేని ఫ్యామిలీలో విషాదం: రారండోయ్ వేడుక రద్దు!

అక్కినేని ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది. నాగార్జున మేనల్లుడు, హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు గురువారం కన్నుమూసారు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జరుగాల్సిన అక్కినేని నాగ చైతన్య మూవీ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుక రద్దయింది. అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె, నాగార్జున సోదరి నాగ సుశీలను అనుమోలు సత్యభూషణ రావు వివాహ మాడారు. అయితే నాగ భూషణరావు గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేసే వారని, సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉండే వారని తెలుస్తోంది.

గుండె పోటు కారణంగా సత్యభూషణరావు మరణించినట్టు తెలుస్తోంది. అనుమోలు సత్య భూషణ్ రావు మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం నెలకొంది.గుండె పోటు కారణంగా సత్యభూషణరావు మరణించినట్టు తెలుస్తోంది. అనుమోలు సత్య భూషణ్ రావు మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం నెలకొంది.

సత్యభూషణరావు మరణ వార్త తెలుసుకున్న వివిధ ప్రాంతాల్లో ఉన్న అక్కినేని కుటుంబీకులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం సత్యభూషణరావు అంత్యక్రియలు జరిగే అవాకాశం ఉంది.

రారండోయ్ వేడుక రద్దు అక్కినేని నాగ చైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినినిమా ఆడియో వేడుక గురువారం సాయంత్రం జరుగాల్సి ఉంది. అయితే సత్యభూషణరావు హఠాన్మరణంతో ఈ వేడుకను రద్దు చేసారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *