పడిపోయిన ప్రతిసారి ఉవ్వెత్తున లేస్తూ… (ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్)

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మే 20వ తేదీతో 34వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ గురించిన సినిమాలు, హిట్లు… ప్లాపుల సంగతులను ఓసారి గుర్తు చేసుకుందాం. ముందుగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నందమూరి సినీ వారసత్వం ఉండటంతో జూ ఎన్టీఆర్ తాతయ్య నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో బాలనటునిగా పరిచయం అయ్యాడు. తరువాత బాల రామాయణం చిత్రంలో ప్రధానమైన రాముడి పాత్రను అద్భుతంగా చేసి అందరి మెప్పు పొందాడు. ఆ తర్వాత 2001లో ‘నిన్ను చూడాలని’ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

ఏ నటుడికైనా కెరీర్లో హిట్లు, ప్లాపులు సహజం…. అయితే ప్లాపుల కారణంగా పడిపోయిన ప్రతిసారి ఉవ్వెత్తున లేస్తూ తన సత్తా చాటుతున్నాడు ఎన్టీఆర్.

తొలి హిట్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రమే ఎన్టీఆర్ కెరీర్లో తొలి హిట్. ఈ సినిమాతో ఎన్టీఆర్, రాజమౌళి మధ్య బంధం బలపడింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మరో రెండు సినిమాలు చేసారు.

టర్నింగ్ పాయింట్ స్టూడెంట్ నెం.1 తర్వాత వచ్చిన ‘సుబ్బు’ చిత్రం నిరాశ పరిచింది. అయితే వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ‘ఆది’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది.

సింహాద్రి ‘ఆది’ తర్వాత వచ్చిన అల్లరి రాముడు సరిగా ఆడలేదు. ఆ తరువాతి ‘సింహాద్రి’ చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో ఎన్టీఆర్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.

వరుస చిత్రాలు ‘సింహాద్రి’ చిత్రం తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించాడు జూ ఎన్టీఆర్. అయితే ఇవన్నీ బక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి.

రాఖీ రాఖీ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాలు ఇవ్వక పోయినా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ ఇద్దరు దర్శకులంటే... జూ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహిత దర్శకులు రాజమౌళి, వివి వినాకయ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు జూ ఎన్టీఆర్‌ను హీరోగా మరోస్థాయికి తీసుకెళ్లాయి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది, అదుర్స్ చిత్రాలు భారీ విజయం సాధించాయి.

ప్లాపులు ఇచ్చిన దర్శకుడు జూ ఎన్టీఆర్ కెరీర్లో భారీ ప్లాపులు ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్. 2008 లో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన “కంత్రి” ప్లాపయింది. 2011 లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో వచ్చిన “శక్తి” చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అతిపెద్ద ప్లాపు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

వరుస ప్లాపులు శక్తి తర్వాత ఊసరవెల్లి, దమ్ము చిత్రాలు కూడా ప్లాపు కావడంతో ఎన్టీఆర్ కాస్త డీలా పడ్డాడు.

పడుతూ లేస్తూ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా హిట్ అయింది. తర్వాత రభస, రామయ్య వస్తావయ్యా ప్లాప్. టెంపర్ చిత్రం ఫర్వాలేదనిపించింది. తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో హిట్. ‘జనతా గ్యారేజ్’ చిత్రం బ్లాక్ బస్టర్….

జై లవ కుశ ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రంలో నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్స్ చూస్తుంటే సినిమా పెద్ద హిట్టయ్యేలా ఉందని అంటున్నారు అభిమానులు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *