స్టార్ రైటర్ తెరవెనుక లీలలు

ఆయన ఒక స్టార్ రైటర్. వర్మ డబ్బింగ్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ కోటి రూపాయలు పైగా తీసుకునే రేంజ్ కి ఎదిగాడు. మిగిలిన రచయితలను సైడ్ లైన్ చేసి మరీ తన ప్రభావాన్ని చూపించుకున్నాడు. అతనిలో కామెడీ టైమింగ్ కి టాలీవుడ్ దాసోహం అంది. గత పదేళ్ళుగా క్యారెక్టర్ స్వాపింగ్ కామెడి తెలుగు సినిమాని ఎంతగా ఊపేస్తుందో చూస్తూనే ఉన్నాం.

ఇటీవలే ఒక యూత్ ఫుల్ లవ్ స్టొరీ వచ్చింది. కథ పాతదే అయినా ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్ గా ఎంటర్టైనింగ్ గా ఉండటంతో ఫుల్ పాజిటివ్ టాక్ తో హిట్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎ సెంటర్స్ లో రికార్డులు కూడా వచ్చేలా ఉన్నాయి. ఈ సినిమాకి దర్శకుడు కొత్త వాడు. సహా నిర్మాత సదరు స్టార్ రైటర్. ఆశ్చర్యంగా టైటిల్స్ లో మాటలు అనే దగ్గర స్టార్ రైటర్ పేరు ఒకసారి వస్తే చివరో దర్శకుడి పేరు దగ్గర కూడా మాటలు అని ఉండటం చూసి అసలు ఎవరు రాసారా అనే డౌట్ అందరికి వచ్చింది. ఆరా తీస్తే తనకు చెప్పిన కథతోనే సినిమా తీసుకోమని, సంభాషణలు కూడా రాసుకోమని తను కావాలంటే సహాయం కూడా చేస్తాను కాని టైటిల్ కార్డు లో మాత్రం తన పేరే ఉండాలని చెప్పడట సినివ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నారు.

గతంలో ఒక హారర్ హిట్ మూవీ విషయంలో కూడా ఈ స్టార్ రైటర్ ఇలాగే ప్రవర్తించాడని తెలిసింది. కాని ఈ కొత్త దర్శకుడు మాత్రం సినిమా అయ్యాకా తన పేరు ఉంచాల్సిందే అని పట్టుబట్టడంతో మధ్యే మార్గంగా ఇద్దరి పేర్లతో మాటలు అని వచ్చేలా రాజీ చేసుకున్నారని తెలిసింది. ఇదేమి కొత్త వ్యవహారం కాదని తన దగ్గరకు వచ్చిన మంచి కథలు, స్క్రిప్ట్స్ విషయంలో ఆ స్టార్ రైటర్ ఇలాగే చేస్తుంటాడని, తన ఒరిజినల్ టాలెంట్ తో ఆ మధ్య రాసిన సినిమాలన్నీ వారం కూడా ఆడకపోవడంతో తన సత్తా చూపాలి అనే ఉద్దేశంతోనే ఈ అడ్డదారి తొక్కాడని టాలీవుడ్ గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. తెరవెనక లీలలు అంటే ఇలాగే ఉంటాయి మరి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *