టాప్-10 లెక్కల్ని మార్చేసిన ఫిదా..

కుటుంబ కథా చిత్రాలకు కలెక్షన్లు ఏ రేంజ్‌లో వస్తాయనేది మరోసారి తేల్చిచెప్పింది ‘ఫిదా’ సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణ సారధ్యంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి కలయికలో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌‌లో కూడా ఓ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది ఓవర్సీస్ కలెక్షన్లను కూడా దాటేసి నయా రికార్డులు సృష్టిస్తోంది. మూడో వీకెండ్‌ వచ్చేసరికి 1.97 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన ఫిదా.. లాంగ్‌రన్‌లో కనీసం 2.3 మిలియన్ డాలర్లను దాటగలదని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ధాటికి ఓవర్సీస్‌లో టాప్-10 లిస్ట్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఏడో స్థానానికి చేరకున్న ఫిదా.. ఎట్టకేలకు టాప్-6 ప్లేస్‌లోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఓవర్సీస్‌లో టాప్-10 లెక్కలను ఫిదా మార్చేసింది. ఆ టాప్-10 సినిమాలేవో ఓ లుక్కేయండి. 
1. బాహుబలి- 2———– 20.47 మిలియన్ డాలర్లు
2. బాహుబలి-1———–7.51 మిలియన్ డాలర్లు
3. శ్రీమంతుడు———– 2.89 మిలియన్ డాలర్లు
4. అ..ఆ..———–2.45 మిలియన్ డాలర్లు
5. ఖైదీ నెం.150———–2.45 మిలియన్ డాలర్లు
6. నాన్నకు ప్రేమతో..———–2.02 మిలియన్ డాలర్లు
7. ఫిదా———– 1.97 మిలియన్ డాలర్లు
8. అత్తారింటికి దారేది———–1.90 మిలియన్ డాలర్లు
9. జనతాగ్యారేజ్———– 1.80 మిలియన్ డాలర్లు
10. గౌతమిపుత్ర శాతకర్ణి———– 1.66 మిలియన్ డాలర్లు
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *