2016లో టాలీవుడ్ టాప్5 కాంట్రవర్సీలు

ఇండస్ట్రీ అన్నాక వివాదాలు.. యాక్టర్స్ అన్నాక వివాదాలు తప్పవనే సంగతి ఒప్పుకోవాల్సిందే. కానీ అందరి దృష్టిని ఆకర్షించి ఆసక్తి రేకెత్తించిన కాంట్రవర్సీలు మాత్రం కొన్నే ఉంటాయి. ఈ ఏడాది టాలీవుడ్ లో సంభవించిన పలు వివాదాల్లో.. టాప్5 ఇవే.

వీడియోలో శ్రావ్య రెడ్డి బూతులు: నోట్ల రద్దు వ్యవహారంపై పలు అనుమానాలను నివృత్తి చేసేందుకు గాను.. నటి శ్రావ్య రెడ్డి ఫేస్ బుక్ లో లైవ్ ఛాట్ నిర్వహించింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ‘నీ సైజ్ ఎంత’ అని అడగడంతో.. ఒళ్లు మండిన శ్రావ్య బూతులు లంకించుకుంది. నెట్ లో శ్రావ్య తిట్టిపోసిన వీడియో ఇప్పటికీ హల్ చల్ చేస్తోంది.

పవన్ ఫ్యాన్ ని పొడిచేసిన జూనియర్ అభిమాని: హీరోల మధ్య అగ్రస్థానం కోసం ఆధిపత్య పోరు అనేది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఉండడమే కరెక్ట్ అనే విషయాన్ని గ్రహించలేక.. జనతా గ్యారేజ్ రిలీజ్ సమయంలో ఓ ఎన్టీఆర్ అభిమాని.. పవన్ ఫ్యాన్ ని పొడిచేయగా.. అతను చనిపోవడం చాలా పెద్ద వివాదం అయింది. ఆ తర్వాత పవన్ కూడా ఆ కుటుంబాన్ని కలిసి సానుభూతి ప్రకటించాడు.

చెప్పను బ్రదర్ అనేసిన బన్నీ: సరైనోడు సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ గురించి మాట్లాడమంటూ.. కేకలు పెడుతున్న పవన్ ఫ్యాన్స్ ను.. చెప్పను బ్రదర్ అంటూ బన్నీ నోరు మూయించేందుకు చేసిన ప్రయత్నం.. మెగా ఫ్యాన్స్ లోనే విబేధాలను చాటి చెప్పింది. దీన్ని శాంతపరిచేందుకు బన్నీ తన వంతు ప్రయత్నం చేశాడు కానీ.. అందులోనూ క్లారిటీ లోపించింది.

వీజే నిరోష ఆత్మహత్య: టీవీ యాంకర్ నిరోష ఆత్మహత్య చేసుకోవడం గ్లామర్ ఇండస్ట్రీతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. బాయ్ ఫ్రెండ్ తో వచ్చిన విబేధాల కారణంగా.. లైవ్ చాట్ లో ఉన్నపుడే అతను చూస్తుండగానే చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది నిరోష. సెలబ్రిటీల జీవితాల్లో ఉన్న సున్నితత్వాన్ని ఈ సంఘటన చాటి చెప్పింది.

మహిళలపై బాలయ్య వ్యాఖ్యలు: నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు.. విమర్శలకు గురయ్యాయి. ‘అమ్మాయికి ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి.. కమిట్.. కమిట్ అయిపోవాలంతే’ అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేకెత్తించగా.. తర్వాత బాలయ్య వాటిపై వివరణ ఇచ్చుకుని.. మహిళలను తాను ఎంతగా గౌరవిస్తాడో చెప్పుకోవాల్సి వచ్చింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *