ఒడిశాలో రైలు ప్రమాదం

కటక్‌: ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్‌ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్‌‌ప్రెస్‌ కటక్‌ సమీపంలోని నిర్గుండి వద్ద వెనక నుంచి గూడ్స్‌ రైలును ఢీకొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 12 భోగిలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కటక్‌లోని ఆస్ప్రత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బందికి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *