కరోనా పాజిటివ్ లీకేజీల పేరుతో…ఓడాక్టర్‌ హల్‌చల్‌

హైదరాబాద్‌: ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండ తెలంగాణ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరినవారికి కరోనా వైరస్ ఉందని పలువురు డాక్టర్లు హడావుడి చేశారు. దీంతో కొందరు వైద్యులపై ఉన్నాతాధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. అయితే.. తనపై అకారణంగా చర్యలు తీసుకున్నారని వసంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. నన్ను వ్యక్తిగతం టార్గెట్ చేస్తున్నారు. గాంధీలో నుంచి పంపించేందుకు కుట్ర పన్నారు. కరోనా పాజిటివ్ లీకేజీల పేరుతో నన్ను బదిలిచేశారు. వ్యతిరేకంగా మాట్లాడితే మాపై చర్యలు తీసుకుంటున్నారు. డాక్టర్‌ తిట్టాడంటూ పది మందితో సంతకాలు చేయించి చర్యలు తీసుకున్నారు. ప్రాణాలు పోసే డాక్టర్‌కే అన్యాయం జరుగుతోంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. సూపరింటెండెంట్‌ సమాధానం చెప్పాలి’ అని వసంత్ దీంతో మంగళవారం నాడు.. ఆస్పత్రికి వచ్చిన డాక్టర్‌ వసంత్‌ హల్‌చల్‌ చేశారు. పెట్రోల్ డబ్బాతో గాంధీ ఆస్పత్రికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్‌ పోసుకుంటుండగా ఆస్పత్రి సిబ్బంది అడ్డుకుంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *