‘బెడ్‌రూమ్‌లో కూడా ఫోటోగ్రాఫర్‌ని పెట్టుకున్నారా?’

వివాహ బంధంతో ఒక్కటయ్యారు ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌. గత ఏడాది డిసెంబర్‌లో ఉదయ్‌పూర్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది వీరి  పెళ్లి వేడుక. ఇన్నాళ్లు పెళ్లి, రిసెప్షన్‌ వేడుకలతో బిజీ, బిజీగా గడిపిన ఈ జంట ప్రస్తుతం వర్క్‌ లైఫ్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ప్రజెంట్‌ ప్రియాంక అత్తారింట్లో ఉంది. కాలీఫోర్నియాలో నిక్‌ జోనాస్‌ కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తుంది. ఈ క్రమంలో భర్త, కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే ప్రియాంక సోషల్‌ మీడియా పోస్టింగులపై మండిపడుతున్నారు అభిమానులు.

రెండు రోజుల క్రితం ప్రియాంక అత్తారింట్లో నిక్‌తో కలిసి రాత్రి టీవీ చూస్తుండగా తీసుకున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హోమ్‌’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్లు ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఫోటోగ్రాఫర్‌ ఎప్పుడు మీ వెంటే ఉంటాడా ఏంటి’.. ‘మరి ఇంత ఓవర్‌గా ప్రచారం చేసుకోవడం ఆపండి. ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందే ఊహించలేం కదా. కాస్తా ప్రైవసీ మెయిన్‌టేన్‌ చేయ్యండి’.. ‘బెడ్‌ రూమ్‌లో కూడా ఫోటోగ్రాఫర్‌ని పెట్టుకున్నారా ఏంటి’  అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ప్రియాంక ‘స్కై ఈజ్‌ పింక్‌’ అనే చిత్రంలో నటిస్తుంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *