తెలంగాణ ఎమ్మెల్యేల జాతకాలివి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన పార్టీ మంత్రులు – ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీలకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. తెలంగాణ భవన్లో తన అధ్యక్షతన జరిగిన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశంలో కీలక సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో TRS 101 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని నేతలతో ప్రస్తావించారు. రాష్ట్రానికి 19.5 శాతం గ్రోత్ రేటు ఉందని ఈ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అసెంబ్లీలో వివరించాలని నేతలకు ఆదేశించారు. 15 రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సూచించారు. సర్వేల వివరాలు చూస్తే ప్రజలు టీఆర్ ఎస్ వైపే ఉన్నారనే విషయం తెలుస్తుందన్నారు సీఎం. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ సర్వే చేయించారు. ఆ సర్వే వివరాలు జిల్లాల వారీగా

ఆదిలాబాద్ రిపోర్ట్:

సిర్పూర్: కోనేరు కోనప్ప – 70.90శాతం

చెన్నూరు (ఎస్సీ): నల్లాల ఓదేలు – 65.10శాతం

బెల్లంపల్లి (ఎస్సీ): దుర్గం చిన్నయ్య – 64.90శాతం

మంచిర్యాల: దివాకరరావు నడిపెల్లి – 32.70శాతం

ఆసీఫాబాద్ (ఎస్టీ): కోవ లక్ష్మి – 62.90 శాతం

ఖానాపూర్ (ఎస్టీ): అజ్మీరా రేఖ – 39.90 శాతం

ఆదిలాబాద్: జోగు రామన్న – 39.90శాతం

బోథ్ (ఎస్టీ): రాథోడ్ బాపురావు – 36.10 శాతం

నిర్మల్: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – 58.40 శాతం

ముథోల్: గడ్డిగారి విఠల్ రెడ్డి – 63.20 శాతం

మెదక్ రిపోర్ట్:

సీఎం కేసీఆర్ 96.60 మార్కులతో మొదటి స్థానంలో ఉంటే – 82.30 స్కోర్ తో మంత్రి హరీష్ రావు రెండో స్థానం దక్కించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి 77.20 మార్కులిస్తే – కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి 66.30 మార్కులు పడ్డాయి. జిల్లాలో ఆంథోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ 44.90 లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు.

నిజామాబాద్ రిపోర్ట్:

నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా 74.70 స్కోర్ తో మంచి పనితీరు కనబరిచారు. జిల్లా మంత్రి పోచారానికి 61 మార్కులు రాగా  బోథన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కు తక్కువగా 39.40 స్కోర్ వచ్చింది.

కరీంనగర్ రిపోర్ట్:

కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్ పనితీరు బాగుందని సీఎం సర్వే చెబుతోంది. 89 మార్కులతో ఈటెల  ఫస్ట్ ప్లేస్ లో ఉంటే జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 68.90 మార్కులతో రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. మంత్రి కేటీఆర్ ఫెర్మామెన్స్ కు 60.40 మార్కులు పడ్డాయి. ఇక వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ 39.10 మార్కులతో సరి పెట్టుకున్నారు.

ఖమ్మం రిపోర్ట్:

ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల ఫస్ట్ ప్లేస్ లో ఉండగా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ చివరిస్థానంలో ఉన్నారు.

మహబూబ్ నగర్ రిపోర్ట్:

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 71.10 మార్కులతో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు.

నాగర్ కర్నూల్ రిపోర్ట్:

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దర్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయి. 67.40 మార్కులతో రెండో ప్లేస్ రాగా మంత్రులు జూపల్లికి 55.20 లక్ష్మారెడ్డి 51.40 వచ్చాయి.

గద్వాల రిపోర్ట్:

గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యేకు డీకే అరుణకు 65 మార్కులొచ్చాయి.

వరంగల్ రిపోర్ట్:

వరంగల్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు 71.20 స్కోర్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా దాస్యం వినయ్ భాస్కర్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ స్పీకర్ మధుసూదనాచారికి 50.20 మార్కులుగా రాగా కొండా సురేఖకు 45 – మంత్రి చందూలాల్ కు 34 మార్కులు పడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అతి తక్కువగా 26.50 స్కోర్ వచ్చింది.

నల్గొండ రిపోర్ట్:

ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి 81.90 మార్కులతో ఫస్ట్ ప్లేస్ ఉంటే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 69.70 రెండో స్థానంలో ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి 45.40 మార్కులు పడ్డాయి. కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతికి సర్వేలో 31.80 మార్కులొచ్చాయి. పీసీసీ చీఫ్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 53.70 – సీఎల్పీ లీడర్ జానాకు 63.20 మార్కులు రాగా…నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 53.70 మార్కులొచ్చాయి.

రంగారెడ్డి రిపోర్ట్:

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి 72.30 మార్కులు పడ్డాయి. ఇక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 70.50 మార్కులతో రెండో స్థానంలో ఉన్నారు. మంత్రి మహేందర్ రెడ్డికి అతి తక్కువగా 38.30 స్కోర్ వచ్చింది.

హైదరాబాద్ రిపోర్ట్:

హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి 84.70 మార్కులతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. రెండో స్థానంలో చార్మినార్ ఎంఐఎం అహ్మద్ ఫాషా ఖాద్రీ 83.30 మార్కులొచ్చాయి. మంత్రికి పద్మారావు 61.50 తలసానికి 57.57 మార్కులు రాగా ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ 57.10 స్కోర్ పడింది. ఇక చివరలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి 34.80 మార్కులతో వెనుకబడ్డారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *