భారత్ పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనన్నట్రంప్

న్యూఢిల్లీ : భారత్ లో తన పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని ట్రంప్ అన్నారు. భారత్ కు అత్యంత అధునాతనమైన అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేయనున్నామని, ఇండియాజ అమెరికా మధ్య సుమారు రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. తన భారత పర్యటన ఎంతో ప్రత్యేకమైనదని ఈ జ్ఞాపకాలను ఎన్నటికీ మర్చిపోలేనని, ఇది రెండు దేశాలకు ఫలవంతమైన పర్యటనగా ఉంటుందని తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలకమైన ఒప్పందాలపై అవగాహనకు వచ్చామని ట్రంప్ చెప్పారు, . భారత్ కు అత్యంత అధునాతనమైన అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేయనున్నామని, 5జీ వైర్ లెస్ నెట్ వర్క్ పై చర్చించామని, సుమారు రూ.21 వేల కోట్ల (మూడు బిలియన్ డాలర్ల) విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని వివరించారు. ఇండోజ పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించామన్నారు.భారత్ కు పెద్ద మొత్తంలో సహజ వాయువు (ఎల్ఎన్ జీ) సరఫరాకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరిందని చెప్పారు. ప్రజాస్వామ్యం, పౌరులకు స్వేచ్ఛా, స్వాతంత్రాల విషయంలో ఇరు దేశాలు ముందున్నాయని తెలిపారు. సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల చర్చల్లో పురోగతి కనిపిస్తోందని.. త్వరలోనే గొప్ప ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి ఇరు దేశాల పౌరులకు భద్రత కల్పించుకునే విషయంపైనా చర్చించామని ట్రంప్ చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద నిరోధం అంశాల్లో అమెరికా, భారత్ తోపాటు ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో సహకారం కొనసాగుతుందని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం మోడి, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత మోడి మాట్లాడుతూ, భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని మోడి అన్నారు. రక్షణ, భద్రత, టెక్నాలజీ వంటి అంశాలపై చర్చలు జరిపామని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని, 21వ శతాబ్దంలో భారత్–అమెరికా స్నేహం కీలకమని అన్నారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *