ప్రదీప్ ఆత్మహత్యకు పావని ప్రొఫైల్ పిక్‌యే కారణమట!

బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తన భార్య సెల్‌ఫోన్‌లోని ప్రొఫైల్ పిక్‌యే ప్రదీప్ ఆత్మహత్యకు కారణమని అంటున్నారు. అసలు నిన్న రాత్రి జరిగిన బర్త్ డే పార్టీ ప్రదీప్ బావమరిదిది కాదని, అతడు కేవలం ప్రదీప్ భార్య పావని స్నేహితుడేనని ప్రదీప్ సన్నిహితులు చెబుతున్నారు. అతడి పేరు శ్రావణ్ అని, దుబాయ్ నుంచి నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడని, అప్పటి నుంచి ప్రదీప్ ఇంట్లోనే అతడు మకాం వేశాడని చెబుతున్నారు. శ్రావణ్‌తో చనువుగా ఉన్న ఫొటోను పావని తన మొబైల్‌లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవడంతో ప్రదీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడని, గొడవకు అదే అసలు కారణమని అంటున్నారు. ప్రదీప్ సూసైడ్ నోట్ కూడా రాయకుండా ఆత్మహత్య చేసుకునేవాడు కాదని తాము కచ్చితంగా చెప్పగలమని అతడి స్నేహితులు పోలీసులకు వివరణ ఇచ్చారు. శ్రావణ్, పావని కలిసి ప్రదీప్‌ను హత్య చేసి ఉండొచ్చని ప్రదీప్ స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు.
నిన్న రాత్రి 1.30 నుంచి ఉదయం 4.30 వరకు భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గొడవ కారణంగా ప్రదీప్ బాటిల్‌తో తల పగలగొట్టుకున్నాడని, గాజు ముక్కలు కనిపించకుండా పనిమనిషిని పిలిపించి పావని క్లీన్ చేయించిందని స్థానికులు చెబతున్నారు. ఆత్మహత్యకు ముందు అద్దం పగలగొట్టగా చేతికి అంటుకున్న రక్తపు మరకలను కూడా పావనియే తుడిచేసిందట. సూసైడ్ నోట్ కనిపించకపోవడం, మృతదేహం మంచం కింద ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. క్లూస్ టీమ్ రంగంలోకి దిగడంతో త్వరలోనే ప్రదీప్ సూసైడ్ మిస్టరీ వీడుతుందేమో చూద్దాం. మరిన్ని వివరాలకు ఈ వీడియో క్లిక్ చేసి చూడండి…
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *