రివ్యూ: సునీల్ “ఉంగరాల రాంబాబు”

కథ

చిన్నప్పుడు భయస్తుడుగా ఉండే రాంబాబు(సునీల్)తాతయ్య మాటలు విని ధైర్యవంతుడిగా మారతాడు. అనుకోకుండా వచ్చిన అదృష్టం, బాదాం బాబా(పోసాని) ఆశీసుల వల్ల రాంబాబు ఒక ట్రావెల్ ఆఫీస్ రన్ చేస్తూ ఉంటాడు. కాని మెల్లగా నష్టాలు మొదలవుతాయ. తన జాతకం ప్రకారం సెట్ అయ్యే అమ్మాయిని చేసుకుంటే దశ తిరుగుతుందని నమ్మి ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అందులో ఉద్యోగిగా చేరుతుంది సావిత్రి(మియా జార్జ్). ఆఫీస్ పని మీద దుబాయ్ వెళ్ళినప్పుడు రాంబాబు, సావిత్రి ప్రేమలో పడతారు. ఈ క్రమంలో సావిత్రి తన తండ్రి రంగా(ప్రకాష్ రాజ్)ను రాంబాబుకు పరిచయం చేస్తుంది. రంగా కేరళలో గొప్ప అభ్యుదయ భావాలు ఉన్న కమ్యునిస్టు లీడర్. తన ప్రాంత రైతు భూమి సమస్యల కోసం పోరాడుతూ ఉంటాడు. ప్రేమ కోసం రాంబాబు కేరళ వెళ్లి రంగా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మరోవైపు రైతుల కోసం రంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మరి రాంబాబు అతనితో చేతులు కలిపి తన ప్రేమను గెలిపించుకుంటాడా లేదా అనేది క్లైమాక్స్.

నటీనటులు

సునీల్ నటన గురించి ప్రత్యేకించి చెప్పడానికి ఏమి లేదు. ఇందులో అతను ప్రత్యేకంగా చేసింది కూడా ఏమి లేదు. తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజంతో అన్ని సినిమాల్లో లాగే కనిపించిన సునీల్ ఇందులో కొద్దిగా అతి తగ్గించడం మాత్రమే రిలీఫ్ అనిపిస్తుంది. మెగా ఫాన్స్ ను  అలరించడం కోసం పెట్టుకున్న ఇంట్రో సీన్ పర్వాలేదు అనిపిస్తే సినిమా సాంతం సునీల్ లో మనం చెప్పుకోదగ్గ మార్పేమీ లేదే అనిపిస్తాడు. సునీల్ కమర్షియల్ హీరో మెటీరియల్ కాదు అనే విషయం ఇప్పటికైనా తనకు తాను గుర్తిస్తే మంచిది. రొటీన్ కథల ఉచ్చులో పడి తనలో కామెడీ యాక్టర్ ను కూడా చంపుకున్న సునీల్ ఇక ముందు ముందు ఇలాంటి కథలతోనే కొనసాగుతాను అంటే కష్టమే. హీరొయిన్ మియా జార్జ్ సునీల్ కు తగ్గ జోడి అనలేం కాని తన గ్లామర్ కు ఇంత కన్నా అవకాశాలు ఆశించలేం. ఓ మోస్తరుగా బాగానే చేసింది. కమ్యునిస్ట్ లీడర్ గా ప్రకాష్ రాజ్ మాత్రం తనదైన శైలిలో పాత్రను ఆడేసుకున్నాడు. కాని సెకండ్ హాఫ్ లో ఇంత పెద్ద నటుడిని వాడుకోవడం తెలియక రొటీన్ సీన్స్ తో లాగించడం దర్శకత్వ లోపమే. ఆవేశపడుతూ స్పీచులిచ్చే సీన్స్ లో ప్రకాష్ రాజ్ వ్యవహారం చాలా రొటీన్ గా అనిపిస్తుంది. పోసాని, వెన్నెల కిషోర్ చెరో భాగాన్ని దత్తత తీసుకుని ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేసారు. రాజీవ్ కనకాల, తాగుబోతు రమేష్, చలపతి రావు, ఆశిష్ విద్యార్ధి, మురళి శర్మ తమకు అలవాటైన పాత్రల్లో బాగా ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం

దర్శకుడు క్రాంతి మాధవ్ గత సినిమాలు ఓనమాలు, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు చాలా టిపికల్ జానర్ లో వచ్చిన అతి గొప్ప సినిమాలు. కమర్షియల్ గా పెద్దగా పే చేయలేదు కాని ఇతనికి తెచ్చిన పేరు మాత్రం చిన్నది కాదు. కాని ఇతను ఇలా రిస్క్ చేయకుండా సేఫ్ జోన్ లో ఉండటం కోసం సునీల్ తో ఇలాంటి రెగ్యులర్ మూవీ తీయటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తన సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ పాత్రను పెట్టుకున్నాడు కాని వాణిజ్య సూత్రాలకు లోబడి హీరోతో  పాటలు, ఫైట్లు లాంటి రొటీన్ వ్యవహారానికి క్రాంతి మాధవ్ కూడా లొంగిపోవడం విచారకరం. అలా అని చెప్పి ఈయన తన ప్రతిభతో ఏమైనా కొత్తగా ప్రెజెంట్ చేసాడా అంటే అదీ లేదు. అక్కడక్కడ హక్కుల గురించి రంగా పాత్రతో క్లాసులు పీకించడం తప్ప చేసింది ఏమి లేదు. ఇది ఈయనకు అచ్చి వచ్చే వ్యవహారం కాదు. ఈ మాత్రం సినిమా తీయడానికా క్రాంతి మాధవ్ ఇంత టైం తీసుకున్నారు అనే అనుమానం వస్తుంది. సంగీత దర్శకుడు గీబ్రాన్ లో సారం లేదని ఇంతకు ముందే రుజువయ్యింది. ఒక్క పాట కూడా మైండ్ లో రిజిస్టర్ కాదు. నేపధ్య సంగీతం వరకు పర్వాలేదు. సర్వేశ్ మురారి చాయాగ్రహణం మాత్రం బాగుంది. సునీల్ ని వీలైనంత యంగ్ గా చూపించడానికి చాలా కష్టపడ్డాడు. ఎడిటింగ్ మాత్రం షార్ప్ గా లేదు. పరుచూరి కిరీటి మాత్రం పాపం అవసరానికి మించి భారిగా ఖర్చు పెట్టేసారు.

ప్లస్ పాయింట్స్

ప్రకాష్ రాజ్ పాత్ర

అక్కడక్కడ పేలిన డైలాగ్స్

ఓవర్ గా లేని కామెడీ

 సునీల్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్

క్లైమాక్స్

రొటీన్ కథ

పాటలు

సాగదీసిన కథనం

Rating: 2/5

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *