పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు: ఎంపీ మృతి, బడ్జెట్ వాయిదా పడేనా?

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగం చేశారు. అనేక సవాళ్ల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇది ఆయన ప్రవేశపెట్టనున్న నాలుగో బడ్జెట్.

-బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేయనున్నారు. ఎంపీ అహమద్ మృతి నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడంపై అనుమానాలు రేకెత్తాయి. అయితే స్పీకర్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఓకే చెప్పారు. దీంతో మధ్యాహ్నం పదకొండు గంటలకు జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెడతారు. స్పీకర్ కార్యాలయం పార్టీ కార్యాలయాలకు తెలిపింది.

– 788 కాపీలను ముద్రించారు. సభ్యులకు ప్రతులు, బయటి వారికి డిజిటల్ ప్రతులు అందిస్తున్నారు.

బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి.

8.40 am: మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఫైనాన్స్ మినిస్ట్రీకి వచ్చారు.

8.36 am: బడ్డెట్ వాయిదా పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అహమద్ మృతి నేపథ్యంలో వాయిదా ఉండవచ్చునని అంటున్నారు.

8.35 am: ఎంపీ అహమద్ మృతి నేపథ్యంలో సభను వాయిదా వేసే అంశాన్ని స్పీకర్ నిర్ణయిస్తారని మంత్రి గాంగ్వార్ చెప్పారు.

8.30 am: మాజీ కేంద్రమంత్రి, ఎంపీ ఈ అహమద్ మృతి నేపథ్యంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలనే విషయమై స్పీకర్ నిర్ణయించనున్నారు. వాయిదా వేస్తారా లేదా స్పీకర్ నిర్ణయిస్తారు.

9.10: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ పత్రాలతో రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. బడ్జెట్ ప్రవేశపెట్టాలా? వద్దా అనే విషయంపై ఆయనతో చర్చిస్తున్నట్లు తెలిసింది.

9.45: ఈరోజే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు స్పీకర్ కార్యాలయం.. పార్టీల నేతలకు తెలియజేసింది. నోట్ల రద్దు కారణంగా వీచిన ఎదురుగాలులు, అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంభిస్తున్న రక్షణాత్మక విధానాలను ఎదుర్కొనేలా దేశ ఆర్థిక వ్యవస్థను పదిలపరిచే చర్యలపై జైట్లీ దృష్టిసారించనున్నారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డ ప్రజానీకానికి పన్నుల రాయితీ రూపంలో సాంత్వన కలిగించడం, ఒడిదుడుకులకు గురైన ఆర్థిక రంగాన్ని ఉత్తేజ పరచడమే లక్ష్యంగా పలు వరాలు ప్రకటించే అశకాశం ఉంది. ఈసారి కేంద్ర బడ్జెట్ తయారీలో మహిళల ప్రాధాన్యత పెరిగింది. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో 52 శాతాన్ని వారే రూపొందించడం విశేషం. కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *