సేఫ్ గేమ్ ఆడుతున్న వాల్మీకి

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి రిస్క్ లేకుండా వరుణ్ ఇమేజ్‌కు తగ్గుట్టుగా ఈ బిజినెస్ జరిగింది. వరుణ్ మొత్తానికి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’.  పూజా హెగ్డే హీరోయిన్. అథర్వా మురళి, మృణాళిని రవి, బ్రహ్మాజి, బ్రహ్మానందం, శత్రు తదితరులు నటించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈనెల 20న ‘వాల్మీకి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

మరోవైపు, వరుణ్ తేజ్ ‘F2’తో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా పక్కా మాస్ మూవీని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు టీజర్, ట్రైలర్, పాటల ప్రోమోలు చూసిన తరవాత ‘వాల్మీకి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వాల్మీకి’ థియేట్రికల్ హక్కులను సుమారు రూ.20 కోట్లకు విక్రయించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే సుమారు రూ.25 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తం మీద వరుణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.

ప్రాంతాల వారీగా ‘వాల్మీకి’ థియేట్రికల్ హక్కుల ధరలు

ప్రాంతం  బిజినెస్ (కోట్లలో)

నైజాం   7.40

సీడెడ్    3.35

నెల్లూరు 0.75

కృష్ణా    1.60

గుంటూరు        1.80

విశాఖపట్నం     2.40

తూర్పుగోదావరి  1.60

పశ్చిమగోదావరి   1.10

మొత్తం ఏపీ & టీఎస్       20.00

దేశంలోని ఇతర ప్రాంతాలు 1.50

ఓవర్సీస్ 3.50

ప్రపంచ వ్యాప్తంగా 25.00

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *