పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే చర్చలు…

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై మాత్రమే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సృష్టం చేశారు. జమ్ము-కాశ్మీర్ కు చెందిన కొంతమంది సర్పంచులు, పంచాయితీ సభ్యులు బృందం మంగళవారం ఢిల్లీలో ఆయనను కలిశారు. ఈ సంధర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ జమ్ము-కాశ్మీర్ లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 74 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అది సంతోషం కలిగించే విషయమని అన్నారు. జమ్ము-కాశ్మీర్ లో ఆర్టికల్ 370వ అధికారాన్ని రద్దు చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు మంచి అవకాశం ఏర్పడిందన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *