చిరు, బాలయ్యలకు వెంకీ శుభాకాంక్షలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంత స్నేహపూర్వక సంబందాలు ఉంటాయనడానికి మరో ఉదాహరణ చూపించారు విక్టరీ వెంకటేష్. ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్స్ ల్యాండ్ మార్క్ సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి చిరంజీవి 150వ చిత్రం కాగా మరొకటి బాలకృష్ణ వందో సినిమా. అయితే ఈ సినిమాల విడుదల సందర్భంగా ఈ ఇద్దరికీ మిత్రుడైన వెంకటేష్.. ఖైదీ నంబర్ 150 – గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

చిరు – బాలయ్య ల సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఇద్దరూ గొప్ప నటులే కాకుండా తనకి మంచి స్నేహితులు కూడా అని వీళ్లని మరోసారి తెరపై చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెంకీ తన ఫేస్ బుక్ ద్వారా సందేశం పంపించారు. ఈ సందేశానికి తోడుగా గతంలో వీరు ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోని కూడా పోస్ట్ చేశాడు వెంకీ.

అయితే ఈ సంక్రాంతి బరిలోనే వెంకీ “గురు” సినిమా కూడా రంగంలోకి దిగుతుందని అదే జరిగితే మళ్లీ ఈ సంక్రాంతి మరింత రసవత్తరంగా ఉండేదని అంతా భావించారు. అయితే అయితే ఈ రద్దీలో రిలీజ్ చేయకుండా “గురు”ని హ్యాపీగా వేసవికి వాయిదా వేసేసి సమ్మర్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంకీ. ఏది ఏమైనా స్టార్ అని స్టార్ ప్రొడ్యూసర్ సన్ అని సీనియర్ అని ఎలాంటి భేషజాలు లేకుండా అందరితో కలివిడిగా ఉండే వెంకటేష్… ఈ రెండు సినిమాలకు విషెస్ అందించడం ద్వారా తన క్యారెక్టర్ని ఇంకోసారి చూపించారు. అందరు స్టార్లూ ఇలా ఉంటే… తెలుగు ఇండస్ట్రీ మరెంత బాగుండేదో కదా అని వెంకీ ఫెస్ బుక్ పోస్ట్ అనంతరం కామెంట్స్ వినిపిస్తున్నాయి!!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *