నన్ను ప్రతీనెలా ప్రెగ్నెంట్ చేశారు: విద్యాబాలన్!
డర్టీ భామ విద్యాబాలన్ చాలా బోల్డ్‌గా మాట్లాడుతుంది. ఎవరేమనుకుంటారోనని అలోచించకుండా మనసులో ఉన్నది చెప్పేస్తుంది. తాజాగా మీడియా తీరును ఎండగడుతూ తన మీద తనే జోకులేసుకుంది. ఆమె మీద వెలువడుతున్న గ్యాసిప్సే ఆమెను ఇలా మాట్లాడేలా చేశాయి.
విద్యకు నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత సిద్ధార్థ్‌రాయ్ కపూర్‌తో వివాహమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విద్యకు భర్తతో విబేధాలు తలెత్తాయని, ఆమె విడాకులు తీసుకోనుందని గ్యాసిప్‌లు బయల్దేరాయి. అలాగే విద్య గర్భవతి అని కూడా ఇప్పటికే పలుసార్లు వార్తలు పుట్టించారు గ్యాసిప్ రాయుళ్లు. దీనిపై విద్య తనదైన స్టయిల్లో స్పందించింది.
‘సిద్ధార్థ్‌తో నాకెలాంటి విభేదాలూ లేవు. మేమిద్దరం ఇప్పుడు కలిసే ఉన్నాం. ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో తెలీదు. నా ప్రెగ్నెన్సీ గురించి కూడా ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. మీడియా వాళ్లు ప్రతీనెలా నన్ను ప్రెగ్నెంట్ చేస్తున్నారు. మొదట్లో ఇలాంటి వార్తలకు బాధపడేదాన్ని. ఇప్పుడు అవి అలవాటైపోయాయ’ని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.