మార్షల్ ఆర్ట్స్‌తో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రం తెరకెక్కనుండగా, ముంబైలో తొలి షెడ్యూల్ జరగనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్‌ల్యాండ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. 15 మంది ట్రైనర్స్ విజయ్ దేవరకొండకి మార్షల్ ఆర్ట్స్‌తో పాటు పలు ఫైట్స్‌కి సంబంధించి శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తుంది. తన పాత్ర కోసం విజయ్ డైట్ విషయంలోను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. పాన్ ఇండియన్ సినిమాగా ఫైటర్ సినిమాని తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నాడు. కరణ్ జోహార్, ఛార్మి, పూరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .