విజయ్ మాల్యా అరెస్టు

స్వదేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌ వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు ఆయనను అక్కడ అరెస్టు చేశారు. గత కొంత కాలంగా లండన్‌లోనే ఉంటున్న మాల్యాపై స్వదేశంలో పలు కేసులు ఉన్నాయి. ప్రధానంగా 9వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో మాల్యా నిందితుడు. త్వరలోనే ఆయనను యూకే కోర్టులో ప్రవేశపెడతారు.

భారత్ పదే పదే బ్రిటన్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది…మాల్యా మొత్తం 17 బ్యాంకులకు డబ్బులు ఎగ్గొటి లండన్ పారిపోయి వచ్చేశాడని, అతనిని భారత్‌కు అప్పగించాలని కోరిన నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో లండన్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్టు చేశారు. భారత్ నుంచి సీబీఐ టీమ్ కూడా లండన్‌కు బయలుదేరి వెళ్లినట్లుగా సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *