పరప్పన జైల్లో ఉన్న శశికళ వీడియో లీక్…!

కర్ణాటకలోని పరప్పన జైల్లో శశికళ రాజభోగాలు అనుభవిస్తోందని.. ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారని.. అందుకు ప్రతిగా ఆమె జైలు సిబ్బందితో రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకుందని స్వయంగా మహిళా డీఐజీ రూప కొన్ని రిపోర్ట్‌లు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీఐజీ రూపను బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై వివాదం ఇంకా సమసిపోక ముందే ఇప్పుడు డీఐజీ రూప వాదనకు బలం చేకూరుస్తూ ఓ వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో శశికళ జైలు యూనిఫాం ధరించి ఉంది. ఆమె బయటికొచ్చే ముందు ఇద్దరు మహిళా జైలు సిబ్బంది చుట్టూ తేరిపారా చూడటాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. ఆ తర్వాత శశికళ జైలు డ్రస్ ధరించి.. ఓ చేతిలో కవర్ పట్టుకుని రావడం చూడవచ్చు.

శశికళకు జైలు శిక్ష వేశారా లేదంటే ఆమెను జైల్లో రాజభోగాలు కల్పిస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.     శశికళను కలవడానికి వచ్చేవారి కోసం కూడా అక్కడ ఏర్పాట్లున్నాయి.  మొత్తానికి జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనడానికి ఈ ఫొటోలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *