600 కోట్లు ఉన్నా.. విరుష్క్ షాపింగ్ అక్కడే

చేతిలో నాలుగు రాళ్లు పడితే నేల మీద నిలవని వాళ్లు చాలామందే కనిపిస్తారు. మరి.. అలాంటిది ఇంటర్నేషనల్ చార్మ్ తో పాటు.. తక్కువలో తక్కువ రూ.600 కోట్ల ఆస్తి ఉన్న సెలబ్రిటీ జంట షాపింగ్ అంటే అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. అయితే.. వందల కోట్ల ఆస్తి ఉన్నా.. జాతీయ.. అంతర్జాతీయ ఫేం ఉన్నప్పటికి.. తామిద్దరం పక్కా ప్రాక్టికల్ అన్నట్లుగా చేతల్లో చేసి చూపించి ఇప్పుడు అందరికి విస్మయాన్ని కలిగిస్తున్నారు విరుష్క్.

ఇటీవల ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మలు.. తర్వాత ఢిల్లీ.. ముంబయి అంటూ పలువురు ప్రముఖులకు భారీగా విందులు ఇచ్చారు. ఈ విందుకు ప్రధాని మోడీ మొదలుకొని రాజకీయ.. క్రీడా.. సినిమా.. వ్యాపార రంగాలకు చెందిన వారితో పాటు పలు రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మరింత రేంజ్ ఉన్న వారి షాపింగ్ ఎక్కడ ఉంటుంది? ఎంత రిచ్ గా ఉంటుంది? అన్న ప్రశ్నలు వేసుకొని సమాధానాలు వెతికితే షాక్ తినాల్సిందే.

ఎందుకంటే.. వారి షాపింగ్ దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లోని రోడ్డు పక్కనున్న షాపుల్లో షాపింగ్ చేయటం గమనార్హం. అంతేనా.. డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్న షాపుల వద్దకు వీరు వెళ్లి షాపింగ్ చేయటం కనిపించింది.  తాజాగా తమ షాపింగ్ కు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుల్లో తాము వీధుల పక్కన ఉన్న షాపుల్లో కొనుగోళ్లు చేసిన విషయాన్ని తమ పోస్టులతో పెట్టేశారు. వందల కోట్లు ఉన్నా.. ఎప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు చేయాలన్నది విరుష్క్ లకు బాగా తెలుసని చెప్పక తప్పదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *