ఐసీసీ బెస్ట్ వన్డే కెప్టెన్‌గా కోహ్లి…

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 2016 బెస్ట్ వన్టే,టెస్టు జట్లను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 2016 బెస్ట్ వన్డే కెప్టెన్‌గా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంపికవ్వగా…టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఎంపికయ్యాడు. ఇక ఐసీసీ డ్రీమ్‌ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం దక్కింది. వన్డే జట్టులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా ఎంపికయ్యారు. ఇదే సమయంలో ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో ఏకైక భారతీయుడిగా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో నలుగురు చొప్పున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు, భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు,వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

best-odi-captains
best-odi-captains

ఐసీసీ 2016 వన్డే ప్లేయర్ ఆఫ్‌ ది అవార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ గెల్చుకోగా….భారత స్పీన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు ప్లేయర్ ఆఫ్‌ ది అవార్డుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ చార్లొస్ బ్రాత్ వైట్  టీ20-2016 అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా ఎంపికయ్యాడు.

aswin
aswin

బంగ్లాదేశ్‌ ఆటగాడు ఐసీసీ-2016 ఎమర్జింగ్ ప్లేయర్‌ ప్లేయర్ ఆఫ్ ది అవార్డుకు ఎంపికయ్యాడు.పాకిస్థాన్ టెస్టు క్రికెట్ కెప్టెన్ మిస్బాఉల్ హక్‌కు  ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్- 2016 అవార్డుకు ఎంపికవ్వగా…మారియస్ ఎరాస్మస్ ఐసీసీ బెస్ట్ అంపైర్ 2016గా ఎంపికయ్యాడు.దీంతో దివంగత అంపైర్ డేవిడ్ షెపర్డ్ అవార్డును సైతం గెలుచుకున్నాడు.

test-team
test-team

వన్డే జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), వార్నర్, డి కాక్, రోహిత్ శర్మ, డెవిలియర్స్, బట్లర్, మిచెల్ మార్ష్, జడేజా, స్టార్క్, రబాడా, సునీల్ నరైన్, తాహిర్.

టెస్టు జట్టు: అలిస్టర్ కుక్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఆడం వోజెస్, జానీ బెయిర్ స్టో (కీపర్), బెన్ స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్, రంగన హెరాత్, మిచెల్ స్టార్క్, డేల్ స్టెయిన్, స్టీవెన్ స్మిత్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *