వాట్ ఏ క్యాచ్ కోహ్లీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ ప్రమాదకరంగా మారుతున్న బ్యాట్స్ మెన్ ను తన సూపర్బ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఇది టీమిండియాకు టర్నింగ్ పాయింట్ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హాఫ్ సెంచరీతో అదరగొడుతున్న డికాక్ నవదీప్ సైనీ వేసిన 12 ఓవర్ రెండో బంతిన స్ట్రేట్ డ్రైవ్ ఆడాడు. అది కాస్తా గాల్లోకి లేవడంతో మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి చిరుతలా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో డికాక్ షాక్ గురై భారంగా క్రీజు వదిలి వెళ్లాడు ప్రస్తుతం కోహ్లి అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనితో నెటిజన్లు కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.