టీ20 (T20 World Cup) ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న కొహ్లీ

టీ20 (T20 World Cup) ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న కొహ్లీ:

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తప్పుకోనున్నాడా అంటే అవుననే అంటున్నాయి పలు నివేదికలు.ప్ర‌త్యేకించి వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి కొహ్లీ త‌ప్పుకోనున్న‌ట్టుగా స‌మాచారం. ఈ విష‌యంలో బీసీసీఐ తో చ‌ర్చ‌లు జ‌రిపిన ఈ లెజెండ‌రీ ప్లేయ‌ర్ త్వ‌ర‌లోనే స్వ‌యంగా ఇందుకు సంబంధించి ప్ర‌క‌ట‌న‌ను చేయ‌నున్నాడు.

కొహ్లీ విజ‌య‌వంత‌మైన కెప్టెనే అయిన‌ప్ప‌టికీ.. వైట్ బాల్ క్రికెట్ లో కొహ్లీ కెప్టెన్సీలో జ‌రిగిన అద్భుతాలు లేవు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ను కానీ, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను కానీ కొహ్లీ సేన సాధించ‌లేక‌పోయింది. అలాగే ఇన్నేళ్లుగా కెప్టెన్ గా ఉంటూ త‌న జ‌ట్టుకు ఐపీఎల్ ట్రోఫీని సాధించ‌లేక‌పోతున్నాడు అనే విమ‌ర్శ‌ను కూడా ఎదుర్కొంటున్నాడు కొహ్లీ. మ‌రోవైపు వ్య‌క్తిగ‌తంగా కూడా కొహ్లీ ఫామ్ గొప్ప‌గా లేదు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన రోహిత్‌ శర్మకు టీమిండియా పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ప్రచారం​ జరుగుతోంది. రోహిత్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పేందుకు కోహ్లి సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సారధిగా వ్యవహరిస్తున్న రోహిత్‌ శర్మ ఇదివరకే 5 సార్లు తన జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో సఫలమయ్యాడు. ఇదే ట్రాక్‌ రికార్డును పరిగణలోకి తీసుకుని బీసీసీఐ రోహిత్‌కు పగ్గాలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *