ఈ ఫోటో వల్లే ‘సంఘమిత్ర’ నుంచి శృతిహాసన్‌ తప్పుకుందట

శృతిహాసన్‌తో ‘సంఘమిత్ర’ సినిమా చేస్తున్నట్టు చిత్ర యూనిట్‌ ఎప్పుడో ప్రకటించింది. ‘బాహుబలి’ తరువాత ఖరీదైన బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా తమదే అని గొప్పలు కూడా చెప్పుకుంది. ఈ సినిమా కోసం శృతిహాసన్‌ కష్టతరమైన యుద్ధవిన్యాసాల్లో శిక్షణ కూడా తీసుకుంది. ఎక్కువ బడ్టె్‌ట్‌, స్టార్‌ హీరోయిన్‌ అన్నీ ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్లవుతాయనీ, సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని విమర్శకులు అంచనాకు వచ్చేశారు కూడా! కేన్స్‌ ఉత్సవంలో ‘సంఘమిత్ర’ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. సరిగ్గా ఇక్కడే తేడా కొట్టింది అంటున్నారు సినీ జనాలు. ఆ పోస్టర్‌ ఎవరినీ ఆకట్టుకోకపోగా, దాని మీద బీభత్సమైన విమర్శలు వచ్చాయి. పోస్టర్‌లో ఉన్నది శృతిహాసన్‌ ‌నిజమైన ఫోటో కాదు. పెయింట్‌. దాంతో ఆ పోస్టర్‌ ఎవరినీ ఆకర్షించలేకపోయింది. కేన్స్‌లో మెరిసిపోదామని ఆశించిన శృతికి ఈ విమర్శలు తీవ్ర నిరాశనే మిగిల్చాయట! పోస్టరే ఇలా ఉంటే సినిమా విడుదల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానం శృతికి కలిగింది అంటున్నారు. అందుకే తప్పుకుందనీ, ఈ సినిమా నుంచి వైదొలగడానికి చెబుతున్న కారణాలు నిజం కాకపోవచ్చని కొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
        ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల డేట్లు ఇమ్మంటున్నారనీ, అది కుదరకనే శృతి తప్పుకొందన్న మొదటి కారణం. అసలు కథ చెప్పినప్పుడు డేట్ల విషయం కూడా చెబుతారు. వారు చెప్పిన డేట్లకి కొద్దిగా అటూ ఇటూ కావడం తరచూ జరుగుతూనే ఉంటుంది. మొదట నెలో రెండు నెలలో అని చెప్పి ఒక్కసారి రెండు సంవత్సరాలు అని అనరు కదా? అన్నది కొందరి అనుమానం. పూర్తి స్ర్కిప్ట్‌ శృతికి ఇవ్వలేదన్నది రెండో అనుమానం. ఇది కూడా అనుమానాలకే తావిస్తోందట! మొత్తానికి ఈ సినిమా నుంచి శృతి ఎందుకు తప్పుకోవలసి వచ్చిందో, అందుకు దారితీసిన కారణాలు తదితరాల మీద బోలెడన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *