వాట్సప్‌లో వీడియో కాలింగ్… వచ్చేసింది..!

వాట్సప్ వినియోగదారులకు శుభవార్త. యూజర్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వీడియో కాలింగ్ ఫీచర్ వాట్సప్‌లో వచ్చేసింది. గత కొద్ది నెలలుగా ఈ ఫీచర్ కేవలం వాట్సప్ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడది ఫైనల్ వెర్షన్‌లో యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌కు చెందిన లేటెస్ట్ వెర్షన్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ మొబైల్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. దాంతో ఎంచక్కా వీడియో కాలింగ్ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

వాట్సప్‌లో వీడియోకాలింగ్ చేయాలంటే ముందుగా యూజర్లు ఏదైనా కాంటాక్ట్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం సదరు కాంటాక్ట్ విండోలో పైన ఉండే కాల్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీంతో వాయిస్ కాల్, వీడియో కాల్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో వీడియో కాల్‌ను ఎంచుకుంటే చాలు, దాంతో అవతలి వ్యక్తులకు వీడియో కాల్ వెళ్తుంది. అయితే అవతలి వ్యక్తులు కూడా వాట్సప్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అయితేనే వీడియోకాలింగ్ ఫీచర్ పనిచేస్తుంది. లేదంటే పనిచేయదు. ఎర్రర్ మెసేజ్ చూపుతుంది.

బీటా వెర్షన్‌లో ఉన్నప్పుడే వాట్సప్ వీడియో కాల్ అత్యంత క్వాలిటీతో కూడుకుని ఉండగా, ఇప్పుడది రెట్టింపు అయిందని వాట్సప్ వీడియో కాల్‌ను వాడుతున్న పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. భారత్‌లో 16 కోట్ల మంది వరకు వాట్సప్‌ను వాడుతున్నారని సదరు యూజర్లందరికీ ఇప్పుడీ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చిందని వాట్సప్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *