పెద్ద బాంబు పేలుస్తోన్న వాట్సాప్
వాట్సాప్ వినియోగదారులకు పెద్ద షాక్ తగలనుంది. మీరు ఎప్పుడో ఏళ్ల నాటి ఫోన్లలో వాట్సాప్ వాడుతున్నారా..? అయితే ఇకపై ఆ ఫోన్లలో వాట్సాప్ వచ్చే యేడాది నుంచి పని చేయదు. పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న మొబైల్స్‌లో ఉండే వాట్సాప్ వచ్చే యేడాది నుంచి పనిచేయదు. వాట్సాప్ ఇకపై పాత ఫోన్లకు గుడ్ బై చెప్పే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
వాట్సాప్ వచ్చే ఏడాది ప్లాన్ చేస్తున్న కొత్త అప్డేట్స్ పాత మోడల్స్ లో సపోర్ట్ చేయడం కష్టం అట. వాటి కోసం కొత్తగా యాప్‌ను డవలప్ చేయడం కన్నా పాత మోడల్స్ కి సేవలు అందించడం మానేయాలని కఠినమైన డెసిషన్ వాట్సాప్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
అండ్రాయిడ్ వెర్షన్ 2.1 లేదా 2.2 వాడుతున్న వారు ఇకపై వాట్సాప్ వాడటం కష్టం అని అనుకోవచ్చు. అలాగే iOS 6 దాటని మొబైల్ ఫోన్లు, 3GS డివైజ్ లలలో కూడా వాట్సాప్ పనిచేయకపోవచ్చు. దీంతో బ్లాక్ బెర్రీ, నోకియా ఫోన్స్ వాడుతున్న(కొన్ని మోడల్స్) చాలామంది వాట్సాప్ ఉపయోగించే అవకాశాన్ని కోల్పోవడం ఖాయమని టెక్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్.